Share News

ఫేక్ వీడియో షేర్ చేయడంపై వివరణ ఇచ్చిన అభిజిత్ దీప్కే

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:20 PM

రామ జన్మభూమి ట్రస్ట్ సీఈవో‌ను ఎక్స్ వేదికగా టార్గెట్ చేస్తూ షేర్ చేసిన వీడియోపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వివరణ ఇచ్చారు. తాను షేర్ చేసిన వీడియో ఫేక్ అని తనకు ముందుగా తెలియదని వెల్లడించారు.

ఫేక్ వీడియో షేర్ చేయడంపై వివరణ ఇచ్చిన అభిజిత్ దీప్కే
Abhijit Deepke

ఇంటర్నెట్ డెస్క్: రామ జన్మభూమి ట్రస్ట్ సీఈవో‌ను ఎక్స్ వేదికగా టార్గెట్ చేస్తూ షేర్ చేసిన వీడియోపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వివరణ ఇచ్చారు. తాను షేర్ చేసిన వీడియో ఫేక్ అని తనకు ముందుగా తెలియదని వెల్లడించారు. ‘నేను షేర్ చేసిన వీడియో ఫేక్ అని నాకు తెలియదు. ఏదేమైనా.. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. దానిపై నాకెటువంటి అభ్యంతరాలు లేవు’ అని వ్యాఖ్యానించారు.


బాబీ డియోల్ నటించిన ‘జమాల్ కుడు’ పాటకు డాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను ఆదివారం అభిజిత్ ఎక్స్‌లో షేర్ చేసి, అతను రామజన్మ భూమి తీర్థ ట్రస్ట్ సీఈవో జితేంద్ర మిశ్రా అని పేర్కొన్నారు. ‘వ్యక్తిగత జీవితంలో ఎవరికి నచ్చినట్టుగా వారు ఉండడం తప్పేమీ కాదు. కానీ, ధర్మాన్ని కాపాడేవాళ్లమని చెప్పుకునే వారు దీని గురించి కొంచెం ఆలోచించుకోవాలి. రామజన్మభూమి ట్రస్ట్ సీఈవో ఇలాంటివి చేయకూడదు కదా..’ అని పేర్కొన్నారు.


అయితే, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుని హోదాలో ఉన్న వ్యక్తి ఓ ఫేక్ వీడియోను షేర్ చేయడమేమిటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఇటీవలె రామజన్మభూమి ట్రస్ట్ సీఈవోగా నియమితులయ్యారు. 62 ఏళ్ల మిశ్రా ఎయిర్ ఫోర్స్ విభాగంలో సేవలు అందించి ఎన్నో మెడల్స్ సాధించారు. గత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో ఆయన వెస్ట్రెన్ కమాండ్‌కు సారథ్యం వహించారు.


ఇవి కూడా చదవండి

డొనాల్డ్ ట్రంప్ మరో పోస్టు.. ఆ రాష్ట్రం పేరునూ మార్చేస్తారా?

రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత

Updated Date - Sep 07 , 2026 | 01:27 PM