Share News

తాత మధు వ్యాఖ్యలు బాధాకరం : స్పీకర్ గడ్డం ప్రసాద్

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:44 PM

ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. సభలో మంత్రి సీతక్క కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తాను కూడా తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.

తాత మధు వ్యాఖ్యలు బాధాకరం : స్పీకర్ గడ్డం ప్రసాద్
Gaddam Prasad On Tatha Madhu

హైదరాబాద్: ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. శాసనసభలో మంత్రి సీతక్క కన్నీళ్లు పెట్టుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. సీతక్క మాట్లాడుతున్న సమయంలో తనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతక్క తనకు ఐదేళ్లుగా రాఖీ కడుతున్నారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యల అంశాన్ని శాసనసభలో చర్చించి తీర్మానం చేయనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. అనంతరం ఆ తీర్మానాన్ని కౌన్సిల్‌కు పంపుతామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు.


Also Read:

లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

శాసనసభ కాదు.. దుశ్శాసనసభ. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజం!

Updated Date - Sep 07 , 2026 | 06:13 PM