ల్యాంకోకు బకాయిల చెల్లింపుపై డిస్కంలకు హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:58 AM
బకాయిల చెల్లింపు విషయమై తెలంగాణ డిస్కంలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లకు హైకోర్టులో సోమవారం తాత్కాలిక ఊరట లభించింది.
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): బకాయిల చెల్లింపు విషయమై తెలంగాణ డిస్కంలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లకు హైకోర్టులో సోమవారం తాత్కాలిక ఊరట లభించింది. బకాయిల చెల్లింపుపై ధర్మాసనం స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ డిస్కంల నుంచి లేట్ పేమెంట్ సర్‌ఛార్జి బకాయిలు రావాల్సి ఉందని పేర్కొంటూ ‘ప్రాప్తి’ పోర్టల్‌లో ఏపీలోని ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ ఇన్వాయి్‌సలు నమోదు చేసింది.
ఈ వివాదం అప్పీలేట్ ట్రైబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ(ఏపీటెల్)కి చేరింది. పెండింగ్ బిల్లుల్లో 50శాతం చెల్లించాలంటూ ఏపీటెల్ ఈనెల 2న ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై స్టే ఇవ్వాలని కోరుతూ సోమవారం డిస్కంలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విచారణ జరిపిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం.. స్టే ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News