ముగిసిన నియామక ప్రక్రియను రీఓపెన్ చేయడం చెల్లదు
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:44 AM
అప్పటికే ముగిసిన నియామక ప్రక్రియను మళ్లీ తెరిచి, చట్టబద్ధంగా సర్వీసులో చేరిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని తొలగించలేరని హైకోర్టు పేర్కొంది.
ఉద్యోగిని తొలగించడం కుదరదు: హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అప్పటికే ముగిసిన నియామక ప్రక్రియను మళ్లీ తెరిచి, చట్టబద్ధంగా సర్వీసులో చేరిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని తొలగించలేరని హైకోర్టు పేర్కొంది. డీఎస్సీ- 2024 నియామకాల్లో భాగంగా అప్పటి మెరిట్ జాబితా ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా ఎంపికై, పదినెలలు సర్వీసు కూడా చేసిన తర్వాత చెప్పాపెట్టకుండా ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. సబావట్ వీణ అనే ఉపాధ్యాయురాలిని అన్ని ప్రయోజనాలతో మళ్లీ సర్వీసుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం మోరబావి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న వీణను టర్మినేట్ చేస్తూ డీఈవో జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. డీఎస్సీ నియామకాల సందర్భంగా ఆమె కంటే మెరుగైన ర్యాంకు వచ్చిన మరో అభ్యర్థిపై క్రిమినల్ కేసు ఉండడంతో ఆ వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. తర్వాత ఆ కేసును కోర్టు కొట్టేయడంతో ఆ అభ్యర్థి నిర్దోషిగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మెరుగైన ర్యాంకు వచ్చిందన్న కారణంతో డీఈఓ ఆ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చి, వీణను తొలగించారు. దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో ఆమె దాఖలు చేసిన జస్టిస్ కే శరత్ ధర్మాసనం విస్తృతంగా పరిశీలన జరిపింది. వీణకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తొలగించడం అక్రమమని పేర్కొంది. ఎనిమిది వారాల్లో అన్ని సర్వీసు ప్రయోజనాలతో తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
2027 జూన్ నాటికి కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు పూర్తి
హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లివ్వకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
ఇన్‌స్పెక్టర్‌కు 6 నెలలు టార్చర్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News