Share News

‘22ఏ’లో లేని భూముల రిజిస్ట్రేషన్‌ తిరస్కరించొద్దు

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:20 AM

22-ఏ(నిషేధిత జాబితా)లో లేని భూముల రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించే హక్కు సబ్‌ రిజిస్ర్టార్లకు లేదని హైకోర్టు పేర్కొంది.

‘22ఏ’లో లేని భూముల రిజిస్ట్రేషన్‌ తిరస్కరించొద్దు
Telangana High Court

  • సబ్‌రిజిస్ట్రార్లకు ఆ హక్కు లేదు: హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): 22-ఏ(నిషేధిత జాబితా)లో లేని భూముల రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించే హక్కు సబ్‌ రిజిస్ర్టార్లకు లేదని హైకోర్టు పేర్కొంది. ఫలానా భూములను రిజిస్టర్‌ చేయవద్దంటూ తహసీల్దార్‌ లేదా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ లేఖ రాసినంత మాత్రాన ఆయా భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపివేయడం కుదరదని స్పష్టం చేసింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సర్వే నెంబర్‌ 556, 557, 558, 585లలోని తమ భూముల రిజిస్ట్రేషన్‌కు అధికారులు తిరస్కరిస్తున్నారంటూ శీలం నిర్మల, మారుపాక వెంకట్‌రెడ్డి, విజయలక్ష్మి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.


ఆ భూములు వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందినవని, వాటిని రిజిస్టర్‌ చేయరాదని దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు లేఖ రాయడంతో తమ భూముల రిజిస్ట్రేషన్‌కు వారు తిరస్కరిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ రేణుక యారధర్మాసనం.. రిజిస్ట్రేషన్‌ జరిగినప్పటికీ భూముల టైటిల్‌ (యాజమాన్య హక్కుల)కు సంబంధించిన అంశాన్ని సంబంధిత ట్రిబ్యునల్‌ లేదా సివిల్‌ కోర్టులో తేల్చుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి పిటిషనర్ల భూముల రిజిస్ట్రేషన్లను మాత్రం నిలిపేయడానికి వీలులేదని తేల్చిచెప్పింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 05:20 AM