Share News

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

ABN , Publish Date - Jul 30 , 2026 | 03:03 PM

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Rains in Telangana

హైదరాబాద్, జులై 30: తీవ్ర వాయుగుండం నేపథ్యంలో నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి నిజామాబాద్‌తోపాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.


ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌తోపాటు హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

Read Latest Telangana News And National News

Updated Date - Jul 30 , 2026 | 03:25 PM