తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:35 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 19వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 19వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
విపత్తుల నిర్వహణ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల తీవ్రత పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ప్రజల ప్రాణాలతోపాటు వారి ఆస్తుల రక్షణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వర్షాకాలం ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
గోల్కొండలో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు
అమరావతిపై కుల విషం చిమ్మి పబ్బం గడుపుకుంటున్న వైసీపీ నేతలు: భూమిరెడ్డి
Read Latest TG News And Telugu News