Share News

గోల్కొండలో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:55 PM

హైదరాబాద్‌లోని గోల్కొండలో సంచలనం సృష్టించిన హత్య కేసును పాతబస్తీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గోల్కొండలో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు
Hyderabad Police

హైదరాబాద్, జూన్15: నగరంలోని గోల్కొండలో సంచలనం సృష్టించిన హత్య కేసును పాతబస్తీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచారు. వారికి కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ప్రేమ వివాహమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. 2025, జనవరిలో రుక్సార్ బేగంను మసూద్ చాంది ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని రుక్సార్ సోదరుడు జాహెద్ తీవ్రంగా వ్యతిరేకించాడు.


ఈ నేపథ్యంలో వారితో అతడు తరచూ ఘర్షణకు దిగేవాడు. జూన్‌ 12వ తేదీన సోదరి నివాసానికి తన బంధువులతో కలిసి వెళ్లి మసూద్‌పై జాహెద్ దాడి చేశాడు. ఇనుప రాడ్లు, కత్తులతో బలంగా దాడి చేయడంతో మసూద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ దాడిని మసూద్ తండ్రి షేక్ ఇస్మాయిల్ అడ్డుకోబోయాడు. దాంతో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు.


ఈ హత్యపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ సయ్యద్ ఫియాజ్ పర్యవేక్షణలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో గోల్కొండలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఇనుప రాడ్, కత్తిని గోల్కొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షలు, ప్రేమ వివాహమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.


ఇవి కూడా చదవండి..

అమరావతిపై కుల విషం చిమ్మి పబ్బం గడుపుకుంటున్న వైసీపీ నేతలు: భూమిరెడ్డి

మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ: మంత్రి ఫరూక్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 15 , 2026 | 05:39 PM