Share News

మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ: మంత్రి ఫరూక్

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:24 PM

గొడ్డలి పార్టీ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బిడ్డలు డీఎస్సీ ద్వారా టీచర్లుగా ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కడుపు మంటగా ఉందన్నారు.

మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ: మంత్రి ఫరూక్
AP Minister NMD Farooq

అమరావతి, జూన్15: గొడ్డలి పార్టీ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బిడ్డలు డీఎస్సీ ద్వారా టీచర్లుగా ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కడుపు మంటగా ఉందన్నారు. కుంభకర్ణుడిలా 9 నెలలు నిద్రపోయి ఇప్పుడు లేచి డీఎస్సీపై వైసీపీ అధినేత విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం రాజధాని అమరావతిలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎమ్‌.డీ ఫరూక్ విలేకర్లతో మాట్లాడుతూ.. కడపలో హజ్ భవన్ నిర్మిస్తే దాన్ని పూర్తి చేయకుండా ఐదేళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మైనార్టీల కోసం కూటమి ప్రభుత్వంలో రూ.5 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హజ్ యాత్రికులకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం ఇస్తూ మైనార్టీ బిడ్డల చదువుకు తోడ్పడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్ జగన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు.


నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తలేనని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కర్నూలుకు త్వరలోనే హైకోర్టు బెంచ్ తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వంలో 85 శాతం హామీలకు వైఎస్ జగన్ ఎగనామం పెట్టారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 90 శాతం హామీలను అమలు చేసిందన్నారు. ఆస్తుల కోసం తల్లి, చెల్లిని వేధిస్తున్నారంటూ జగన్‌పై నిప్పులు చెరిగారు. త్వరలో తల్లి, చెల్లిని జగన్ చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.


ఇవి కూడా చదవండి..

అమరావతిపై కుల విషం చిమ్మి పబ్బం గడుపుకుంటున్న వైసీపీ నేతలు: భూమిరెడ్డి

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 15 , 2026 | 03:29 PM