పంచాయతీ ఖాతాలోకే గ్రామ ఆదాయం
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:57 AM
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు వివిధ రూపాల్లో వచ్చే సొంత ఆదాయం.. ట్రెజరీలో కాకుండా నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలోనే జమ చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
హైదరాబాద్, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు వివిధ రూపాల్లో వచ్చే సొంత ఆదాయం.. ట్రెజరీలో కాకుండా నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలోనే జమ చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఈమేరకు తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) చట్టం--2026ను అక్టోబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తూ... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థిశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పల్లెల ఆర్థిక స్వావలంబనకు కీలక ముందడుగు అని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీల సొంత ఆదాయం నేరుగా వాటి ఖాతాల్లోనే జమ కావడంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వేగంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News