Share News

మంత్రులకు పట్టభద్రుల పరీక్ష

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:57 AM

మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మంత్రులకు పరీక్షగా నిలిచాయి. మంత్రిమండలిలో వివేక్‌ మినహా అందరూ మంత్రులూ ఈ రెండు నియోజకవర్గాల్లో శాసనసభ్యులుగానో.. ఇన్‌చార్జి మంత్రులుగానో ఉన్నారు.

మంత్రులకు పట్టభద్రుల పరీక్ష
Telangana graduate MLC elections

  • 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో నల్లగొండ, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మంత్రులకు పరీక్షగా నిలిచాయి. మంత్రిమండలిలో వివేక్‌ మినహా అందరూ మంత్రులూ ఈ రెండు నియోజకవర్గాల్లో శాసనసభ్యులుగానో.. ఇన్‌చార్జి మంత్రులుగానో ఉన్నారు. ఆ రకంగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సర్వోత్తమ్‌రెడ్డిని, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి సామా రామ్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థులుగా ప్రకటించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ స్థానం పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల.. నల్లగొండ నుంచి మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి.. వరంగల్‌ నుంచి మంత్రి సీతక్క.. ఇలా ఆరుగురు మంత్రులు ఈ మూడు జిల్లాల నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారు. అంటే మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి భట్టి సహా ఏడుగురు మంత్రులు జవాబుదారులుగా ఉంటారు. ఇక హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్‌ కోటాలో అజారుద్దీన్‌ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్‌కు ఇన్‌చార్జి మంత్రిగా పొన్నం, రంగారెడ్డి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా దుద్దిళ్ల, మహబూబ్‌నగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా దామోదర ఉన్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాలకూ సీఎం రేవంత్‌రెడ్డి సహా ఏడుగురు మంత్రులు జవాబుదారులుగా ఉంటారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రివర్గంలో 15 మంది ఉంటే. వివేక్‌ మినహా అందరూ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో స్థానికులుగానో, ఇన్‌చార్జి మంత్రులుగానో ప్రాతనిథ్యం వహిస్తున్నారు.


ఫలితంగా రెండు నియోజకర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవడం వారికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. రెండు నియోజకవర్గాల పరిధిలో 11 లోక్‌సభ, 77 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వాటిలో ఆరు లోక్‌సభ, 47 అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్‌ నేతలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ స్థానంలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. వాటిలో 29 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్‌ నేతలే ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఒకరు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన నలుగురిలో కడియం, తెల్లం వెంకట్రావు కాంగ్రె్‌సలో కొనసాగుతున్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఐదుకు ఐదు ఎంపీ సీట్లు కాంగ్రెస్సే గెలుచుకుంది. మొత్తమ్మీద కాంగ్రె్‌సకు బలమైన ప్రాతినిథ్యం ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ఆ పరిధిలోని మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.


హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 43 అసెంబ్లీ సీట్లు ఉంటే.. వీటిలో కాంగ్రెస్‌ ఖాతాలో 18 ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ 17 చోట్ల, మజ్లిస్‌ 7 చోట్ల, బీజేపీ ఒక స్థానంలో ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారిలో దానం, కాలె యాదయ్య, కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి, అరికెపూడి కాంగ్రెస్‌కు అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి ఏర్పడిన దగ్గరి నుంచి ఒక్కసారి కూడా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబాబాద్‌ పట్టభద్రుల సీటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవలేదు. రెండుసార్లు ఇతరుల మద్దతుతో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, ఒకసారి బీజేపీ, మరోమారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ సీటు నుంచి గెలిచాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం ఈ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోనే ఉండటంతో ఈ ఎన్నికను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ దఫా బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈ నియోజకవర్గం పరిధిలోని పార్టీ మద్దతుదారులు, వామపక్ష భావజాలం కలిగిన పట్టభద్రులు, మైనారిటీ పట్టభద్రుల మద్దతుతో గెలుస్తామన్న ధీమాతో ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎండకు గలగల.. వానకు వలవల

ఎల్‌నినో ఉన్నా తాగునీటికి ఇబ్బంది లేదు

విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 04:57 AM