ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్: మంత్రి పొన్నం
ABN , Publish Date - Mar 24 , 2026 | 01:44 PM
హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్, మార్చి 24: హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) తీసుకువస్తున్నట్లు తెలిపారు. రూ.1000 కోట్ల ఆదాయం నష్టమైనా ఈవీ వాహనాలు తీసుకొస్తున్నామని వివరించారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ.. కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఈవీ వాహనాలపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని ప్రకటించారు.
తెలంగాణ కాలుష్య రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రయత్నిస్తున్నామని.. అందుకోసం ఈ ప్రయత్నం తీసుకువచ్చామని మంత్రి పొన్నం తెలిపారు. ఈవీ ఆటోలతోపాటు బస్సులను సైతం తీసుకుని వస్తున్నామన్నారు. నగరాన్ని క్యూర్ చేయాలని ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఈవీ వాహనాలకు సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలోని వివిధ ప్రధాన నగరాలు.. తీవ్ర కాలుష్యంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం వల్లే ఈ విధంగా తయారవుతున్నాయని ఇప్పటికే పలు అధ్యాయనాల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వెళ్తున్నానని తెలిసి.. అలా వచ్చి వెళ్లారు: జీవన్ రెడ్డి
ఈ చిన్న చిట్కాతో ఆర్థరైటిస్‌కు చెక్..
For More TG News And Telugu News