Share News

గవర్నర్‌ ఎక్సలెన్స్‌ అవార్డులు-2026

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:24 AM

వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించి, వారి సేవలకు గుర్తింపు తెచ్చేందుకు గవర్నర్‌ ఎక్సలెన్స్‌ అవార్డులు-2026 ప్రదానం చేయనున్నట్లు గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్‌ తెలిపారు.

గవర్నర్‌ ఎక్సలెన్స్‌ అవార్డులు-2026
Telangana Governor Excellence Awards 2026

  • డిసెంబరు 10 వరకు దరఖాస్తుల స్వీకరణ

  • జనవరి 26న పురస్కారాల ప్రదానం: దానకిశోర్‌

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించి, వారి సేవలకు గుర్తింపు తెచ్చేందుకు గవర్నర్‌ ఎక్సలెన్స్‌ అవార్డులు-2026 ప్రదానం చేయనున్నట్లు గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్‌ తెలిపారు. నాలుగు విభాగాల నుంచి ఎంపిక చేసిన వారికి 2027 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు సోమవారం మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల పోర్టల్‌ను దానకిషోర్‌ సోమవారం ఆవిష్కరించి, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు.


డిసెంబరు 10 వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. మాదక ద్రవ్య రహిత తెలంగాణ, ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమం-సాధికారత, పర్యావరణ పరిరక్షణ, స్టార్ట్‌పలు, వినూత్న ఉత్పత్తుల అభివృద్థి... ఈ విభాగాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి చెందిన అరుపలైన వ్యక్తులు, రిజిస్టర్డ్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, స్టార్ట్‌పలు, ఇతర సంస్థలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గవర్నర్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://governor.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా దరఖాస్తులను సంబంధిత ఆధారాలతో కలిపి లోక్‌భవన్‌లోనూ సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు 9392424483 నంబర్‌లో లేదా liasionofficerlbhyd@telangana.gov.in ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని దానకిషోర్‌ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 06:24 AM