Share News

ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి..: గవర్నర్‌, సీఎం దసరా శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:56 AM

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, సీఎం రేవంత్‌ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి..: గవర్నర్‌, సీఎం దసరా శుభాకాంక్షలు
Revanth Reddy , Shiv Pratap Shukla

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, సీఎం రేవంత్‌ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని.. ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో ధైర్యం, ధర్మ నిష్ఠ, సత్ప్రవర్తన, సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని.. పండుగ సందర్భంగా జమ్మిచెట్టుకు పూజలు చేయడం, జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రత్యేక సంప్రదాయమని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా వేర్వేరు ప్రకటనల్లో దసరా శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

రేషన్‌ షాపుల్లో గోదుమ పిండి, నిత్యావసరాలు!

ఎల్‌నినోతో ప్రపంచానికే ముప్పు

34 నెలల్లో 12.4లక్షల పాసు పుస్తకాలు ఇచ్చాం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 05:56 AM