లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:35 AM
ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, వేముల వీరేశం, ఎమ్మెల్యే మందుల సామేలు తదితరులు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతా్‌పరెడ్డితో కలిసి పరామర్శించారు.
ఇందిరమ్మ ఇంటి పత్రం అందజేత
అద్దంకి, వీరేశం, కొమ్మూరి పరామర్శ
హైదరాబాద్/బచ్చన్నపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, వేముల వీరేశం, ఎమ్మెల్యే మందుల సామేలు తదితరులు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతా్‌పరెడ్డితో కలిసి పరామర్శించారు. గురువారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలోని లక్ష్మణ్ గౌడ్ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో వారు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 లక్షల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేశారు. లక్ష్మణ్ గౌడ్ భార్యకు ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తామని వారు హామీనిచ్చారు.
లక్ష్మణ్ గౌడ్ మరణం సీఎం రేవంత్‌రెడ్డిని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని అద్దంకి అన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు సీఎం తమను పంపించారని వేముల వీరేశం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య తమను బాధించిందని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతినిధి కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్‌గౌడ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రెవెన్యూ అధికారులు లక్ష్మణ్ గౌడ్‌ను ఇబ్బందులు పెట్టినట్టు గుర్తించామని.. ఈ విషయంపై సీఎంను కలిసి నివేదిస్తామని చెప్పారు. లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు దుయ్యబట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News