హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
ABN , Publish Date - Jul 27 , 2026 | 06:35 PM
హైడ్రా చీఫ్ ఎ.వి.రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, జులై 27: హైడ్రా చీఫ్ ఎ.వి.రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా ప్రభుత్వం నిలవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్‌ను న్యూఢిల్లీ పంపించారు. అలాగే గతంలో కోర్టు ధిక్కారణ పిటిషన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత.. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని యోజనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని పేర్కొంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని అభిప్రాయపడింది. ఆయన్ని తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త చంద్రబాబే.. బొత్స వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: మంత్రి శ్రీనివాస్
Read Latest Telangana News And Telugu News