Share News

లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Jul 27 , 2026 | 03:17 PM

సుప్రీంకోర్టులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్క ఎదురైంది. ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుడు దొడ్డా వెంకట సత్యప్రసాద్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
YCP Leader Chevireddy Bhaskar Reddy

న్యూఢిల్లీ, జులై 27: సుప్రీంకోర్టులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్క ఎదురైంది. ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుడు దొడ్డా వెంకట సత్యప్రసాద్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సోమవారం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్‌లో పలు సందేహాలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏమైనా సందేహాలుంటే సరైన సమయంలో తమ అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించవచ్చని ఆ వైసీపీ నేతకు ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది.


అయితే దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారంటూ ఆ పిటిషన్‌లో వైసీపీ నేత చెవిరెడ్డి ఆరోపించారు. దొడ్డా వెంకట సత్యప్రసాద్‌కు ఇచ్చిన ముందస్తు బెయిల్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేసిన విషయం విదితమే.


ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా వెంకట సత్యప్రసాద్‌లను అప్రూవర్‌లుగా మార్చి.. తద్వారా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌ని ఇరికించేందుకు కూటమి ప్రభుత్వంతోపాటు ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) కుట్ర పన్నుతున్నాయని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో ‘మీ మార్ట్స్’.. ఎన్‌సీసీఎఫ్‌తో పౌరసరఫరాల శాఖ కీలక ఎంవోయూ

కృష్ణా జలాల్లో వాటాపై సుప్రీంకోర్టులో విచారణ.. కర్ణాటక విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2026 | 03:25 PM