Share News

భర్త మరణిస్తే.. వెంటనే భార్యకు పింఛను

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:48 AM

చేయూత పింఛను అందుకునే అన్ని కేటగిరీల లబ్ధిదారుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవీయ నిర్ణయం తీసుకుంది.

భర్త మరణిస్తే.. వెంటనే భార్యకు పింఛను
Pension Scheme

  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • ఇప్పటి వరకు వృద్ధాప్య పింఛనుదారులకే

  • ఇప్పుడు అన్ని క్యాటగిరీలకూ వర్తింపు

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): చేయూత పింఛను అందుకునే అన్ని కేటగిరీల లబ్ధిదారుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవీయ నిర్ణయం తీసుకుంది. ఆ పింఛను పొందే భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛను మంజూరు చేసేందుకు ప్రత్యేక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు వృద్ధాప్య పింఛను పొందుతున్న భర్త మరణించిన సందర్భంలో ఆయన భార్యకు వెంటనే పింఛను మంజూరు చేసే సదుపాయం అమల్లో ఉంది. తాజాగా ప్రభుత్వం ఈసదుపాయాన్ని ఇతర కేటగిరీల పింఛన్లకూ విస్తరించింది.


దీంతో దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్‌, హెచ్‌ఐవీ బాధితులు, ఫైలేరియా బాధితుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వారికి అండగా నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. మరణించిన పురుష పింఛనుదారుడి భార్య వయస్సు 57 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే వితంతు పింఛను, 57 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వృద్ధాప్య పింఛను మంజూరు చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్యారంటీ లేకుండానే రైస్‌ మిల్లు ఆస్తుల బదిలీ

క్యాన్సర్‌ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా.

క్రీడల్లో ప్రపంచంతో తెలంగాణ పోటీ


Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 05:48 AM