Share News

స్పాన్సర్‌షిప్‌లతో గ్లోబల్‌ సమ్మిట్‌.!

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:34 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ను ఈసారి ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా నిర్వహించేలా అధికార వర్గాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.

స్పాన్సర్‌షిప్‌లతో గ్లోబల్‌ సమ్మిట్‌.!
Telangana Government

  • ప్రభుత్వ నిధులు లేకుండా నిర్వహించేలా ప్లాన్‌

  • పలు కంపెనీలతో స్పాన్సర్‌షిప్‌ చేయించాలని యోచన

  • గతేడాదిని మించి పెట్టుబడులు తీసుకువచ్చేలా ప్రణాళిక

హైదరాబాద్‌, అక్టోబరు 05 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ను ఈసారి ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా నిర్వహించేలా అధికార వర్గాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ సదస్సును పూర్తిగా కార్పొరేట్‌ స్పాన్సర్‌షి్‌పల ద్వారానే నిర్వహించాలని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల అంతర్గత సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన పలు సమ్మిట్ల తరహాలోనే ఈ సదస్సును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా దేశవిదేశాల్లో నిర్వహించ తలపెట్టిన రోడ్‌ షోలనే ప్రధాన వేదికలుగా మలుచుకోనున్నారు.


విదేశీ రోడ్‌ షోల పర్యవేక్షణ కోసం ఇప్పటికే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయగా, మరికొంత మందిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. ఏయే ప్రాంతాల్లో రోడ్‌ షోలు నిర్వహించాలి, అక్కడి నుంచి స్పాన్సర్‌షి్‌పలను ఎలా రాబట్టాలనే అంశంపై ఈ కమిటీ సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోంది. సదస్సుకు హాజరయ్యే దిగ్గజ కంపెనీలు స్పాన్సర్‌షిప్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో, అలాంటి సంస్థలను ముందుగా గుర్తించి, ప్రత్యేకంగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. మరోవైపు, గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన సమ్మిట్‌ ద్వారా వచ్చిన పెట్టుబడుల కంటే ఈసారి మరికొంత ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యూహాలను అమలు చేస్తోంది. రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాల విషయంలో ప్రత్యేక వెసులుబాట్లు, సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...
‘మహాలక్ష్మి’కి మస్త్‌ డిమాండ్‌!

ఇద్దరు గిరిజన బాలికల ఆత్మహత్యాయత్నం
ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో హనీట్రాప్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 06:34 AM