Share News

50 శాతం బాకాయిలు తక్షణమే చెల్లించండి

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:53 AM

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతన బకాయిలు సుదీర్ఘకాలంగా విడుదల కాకపోవడంతో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమాఖ్య (ఫాతీ) ఆందోళన వ్యక్తం చేసింది.

50 శాతం బాకాయిలు తక్షణమే  చెల్లించండి
FATHI

  • సిబ్బందికి వేతనాలూ చెల్లించలేకపోతున్నాం

  • సీఎస్‌ సంజయ్‌ జాజుకు ‘ఫాతీ’ ప్రతినిధుల వినతి

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతన బకాయిలు సుదీర్ఘకాలంగా విడుదల కాకపోవడంతో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమాఖ్య (ఫాతీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌ బకాయిలను విడుదల చేయాలని, కనీసం 50 శాతం బకాయిలను అత్యవసరంగా చెల్లించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతోపాటు ఆర్థిక, ఉన్నత విద్య, సాంఘిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులకు ఫాతీ ప్రతినిధులు మంగళవారం వినతిపత్రాలు సమర్పించారు.


ప్రభుత్వ హామీ మేరకు ట్యూషన్‌ ఫీజులను వసూలు చేయకుండానే అర్హులైన విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించామని గుర్తు చేశారు. పాత బకాయిలతోపాటు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు పెండింగ్‌లో ఉండటంతో కళాశాలలపై ఆర్థిక భారం పెరిగిందని వివరించారు. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో సిబ్బందికి జీతాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ బియ్యం.. బ్రాండెడ్‌ దందా

జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్‌!

పంటల ధరలు పైపైకి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:53 AM