Share News

తెలంగాణ రైతులకు తెలుగులోనే ఏఐ వ్యవసాయ సలహాలు: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:31 PM

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తెలుగులోనే ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలను వారికి ఇవ్వనుంది.

తెలంగాణ రైతులకు తెలుగులోనే ఏఐ వ్యవసాయ సలహాలు: మంత్రి తుమ్మల
TG Minister Tummala Nageswara Rao

హైదరాబాద్, నవంబర్12: రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తెలుగులోనే ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలను వారికి ఇవ్వనుంది. అందుకోసం తెలంగాణలో భారత్ విస్తార్ సేవల అమలుకు వ్యవసాయ శాఖ, ఎన్ఐఎస్‌జీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దీంతో రైతు ముంగిటకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకెళ్తామని అన్నారు. ఏఐతో ముందుగానే పంట సమస్యల గుర్తింపు.. తద్వారా నష్టాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సాంకేతికతతో వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులకు ఆరు కీలక వ్యవసాయ సేవలు.. ఒకే డిజిటల్ వేదికపైకి వస్తాయని వివరించారు.


గురువారం హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సాగు వ్యయం తగ్గించి.. దిగుబడులు, రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతుల ప్రశ్నలకు ఏఐ వాయిస్ అసిస్టెంట్ 'భారతి' ద్వారా సమాధానాలు ఇస్తుందని తెలిపారు. పంటల సాగు, వాతావరణం, చీడ పీడలు, నేల ఆరోగ్యంపై శాస్త్రీయ సూచనలు కూడా ఇస్తుందని వివరించారు. ఎరువుల వినియోగం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.


155261 హెల్ప్‌ లైన్ ద్వారా వాయిస్ బాట్ సేవలు ఇప్పటికే అందుబాటులో వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. 15 నుంచి 21 రోజుల్లో తెలుగు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. 45 నుంచి 60 రోజుల్లో వాట్సాప్ చాట్‌ బాట్ సేవలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు.


సాధారణ ఫోన్ వినియోగించే రైతులకు కూడా వాయిస్ కాల్ ద్వారా సేవలు అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగు దశల్లో భారత్ విస్తార్ సేవల విస్తరణకు కార్యాచరణ రూపొందించామని అన్నారు. తెలంగాణ పంటలు, స్థానిక వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమాచారం అనుసంధానం చేస్తామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల RKVY నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావ్ సవాల్.. గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా!

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

For More TG News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:51 PM