Share News

చేయూత గడువు పెంపు

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:17 AM

చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును తెలంగాణ సర్కారు పొడిగించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో 15 రోజులు పొడిగించి ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది.

చేయూత గడువు పెంపు
Cheyutha

  • ఈనెల 15 వరకు అవకాశం

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును తెలంగాణ సర్కారు పొడిగించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో 15 రోజులు పొడిగించి ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణకు తక్కువ సమయం ఉండటం, అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం, ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీలో సాంకేతిక ఇబ్బందులు వంటి కారణాలతో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని సమాచారం. ఇక సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 4,81,462 మంది చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోగా.. అందులో వితంతువుల క్యాటగిరీలో అత్యధికంగా 2,83,492 దరఖాస్తులు అందినట్లు సెర్ప్‌ విభాగాలు తెలిపాయి. దివ్యాంగులు 1,16,652 మంది, ఒంటరి మహిళలు 30,452, చేనేతకార్మికులు 12,750, గీత కార్మికులు 30,416 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించాయి. ఈ దరఖాస్తులపై మంగళవారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్‌, కార్పొరేషన్‌ సిబ్బంది దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించనున్నారు. నిబంధనల ప్రకారం తుది జాబితాను రూ పొందించి కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నారు. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారందరికీ అవకాశం కల్పించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి

ఖరీఫ్‌ పంటలు గట్టెక్కేనా?

విదేశీ రోగుల కోసం 400 పడకలు

Updated Date - Sep 01 , 2026 | 06:18 AM