18 మంది కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:18 AM
ఆదిలాబాద్, గజ్వేల్, సిరిసిల్ల, కరీంనగర్ నియోజకవర్గాల్లో వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి 18 మంది వరకు పార్టీ నేతలకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీలో నిర్ణయం
నేను పార్టీ నియమావళిని ఏనాడూ ఉల్లంఘించలే
కమిటీ చైర్మన్ మల్లు రవి
హైదరాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్, గజ్వేల్, సిరిసిల్ల, కరీంనగర్ నియోజకవర్గాల్లో వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి 18 మంది వరకు పార్టీ నేతలకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆదివారం గాంధీభవన్‌లో చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన భేటీ అయిన క్రమశిక్షణా కమిటీ.. ఈ ఘటనలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై చర్చించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన గొడవకు సంబంధించి పార్టీ నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రెడ్డిలకు.. గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పార్టీ నేత జూపల్లి మల్లారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. అలాగే పెద్దపల్లి ఎంపీ వంశీ కారుపై దాడి జరిగినట్లుగా వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఆరుగురు నేతలకు, సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన ఘటనకు సంబంధించి డీసీసీ అధ్యక్షుడు సింగితం శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఏడుగురు నాయకులకు.. కరీంనగర్ 3వ డివిజన్ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పార్టీ నాయకురాలు మూల లక్ష్మికి కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న నాయకులు వారంలోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా పని చేయడం తన డిక్షనరీలోనే లేదని మల్లు రవి అన్నారు. కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఏదైనా పొరపాటు చేస్తే తనపై ఏఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. తనకు కొండా సురేఖ, చిన్నారెడ్డిలతో ఎలాంటి విభేధాలూ రాలేదని, ఎవరిపైనా కక్షతో తాను నివేదికలు ఇవ్వలేదని చెప్పారు.
అసెంబ్లీకి రాని కేసీఆర్.. ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తాడా?: ఆది శ్రీనివాస్
అసెంబ్లీకి రావడం చేతకాని కేసీఆర్ ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తాడా అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఆయన బకరాలను చేస్తున్నాడని.. ఎమ్మెల్యేలకు గాలి కొట్టి పార్టీలోనే ఉంచుకోవడానికి తాపత్రయపడుతున్నాడన్నారు. వెయ్యి రోజుల్లో పట్టుమని పది సార్లు ఫాంహౌస్ దాటి రాని కేసీఆర్ కూడా పోరాటాల గురించి మాట్లాడుతున్నాడని ఓ ప్రకటనలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రమ్మని అడిగితే.. సీఎం బూతులు తిడుతున్నాడంటూ చిన్నపిల్లాడిలా వంకలు చెబుతున్నాడన్నారు. ‘మా సీఎం రేవంత్ ఏనాడైనా అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడారా? ప్రతి మాట రికార్డుల్లో ఉంటుంది. కేసీఆర్‌కు దమ్ముంటే ఆ మాటలు ఏమిటో చూపించాలి’ అంటూ సవాల్ విసిరారు. బూతుల గురించి, ఎదుటివారిని కించపరిచే మాటల గురించి కేసీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్త జనసంద్రంగా వేములవాడ
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News