Share News

ఎల్‌నినో సవాళ్లపై 10వేల కోట్లతో సమరభేరి

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:42 AM

ఎల్‌నినోతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ.10వేల కోట్లతో కరువు ప్రభావ నివారణ చర్యలను చేపట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఎల్‌నినో సవాళ్లపై 10వేల కోట్లతో సమరభేరి

  • సంక్రాంతి తర్వాత 5నెలలు కరువు ప్రభావ నివారణ పనులు

  • మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ.10వేల కోట్లతో కరువు ప్రభావ నివారణ చర్యలను చేపట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. బేగంపేటలో నిర్వహించిన తెలంగాణ క్లైమేట్‌ కాంక్లేవ్‌-కర్టెన్‌రైజర్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎల్‌నినో ప్రభావం, సాగునీరు, తాగునీరుకు సంబంధించిన పలు అంశాలను, ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.


రైతులు, గ్రామీణ ప్రజలు ఆందోళన చెందవద్దని సంక్రాంతి తర్వాత 5 నెలల పాటు... కరువు ప్రభావిత ప్రాంతాల్లో నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తూ పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారని ఆయన తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతో క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పనులు ఎంపిక చేస్తామని, ఎల్‌నినో ప్రభావ నివారణకు ఐదంచెల వ్యూహన్ని రూపొందించామని వివరించారు. పచ్చదనం, జలభద్రతతో వాతావరణ ప్రతికూలతను తట్టుకునే తెలంగాణను నిర్మిస్తామని ఉత్తమ్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం

డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 05:42 AM