Share News

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణలో రూ.10 వేల కోట్ల ప్రణాళిక: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Nov 24 , 2026 | 07:56 PM

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారీ కార్యాచరణ సిద్దం చేసినట్లు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణలో రూ.10 వేల కోట్ల ప్రణాళిక: మంత్రి ఉత్తమ్
TG Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారీ కార్యాచరణ సిద్దం చేసినట్లు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. వాతావరణ సవాళ్ల పరిష్కారానికి రూ.10 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. ఐదు నెలల పాటు ఎల్‌నినో సన్నద్ధత కార్యక్రమం చేపట్టినున్నట్లు వివరించారు. సంక్రాంతి తర్వాత ప్రతి నెల రూ.2 వేల కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.


చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. భూగర్భ జలాల రీ ఛార్జ్, వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపడతామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పరిరక్షణతో పాటు ఉపాధి కల్పన చేపడతామని పేర్కొన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే పంటల సాగుకు ప్రోత్సాహమిస్తామని అన్నారు. ఏడాదికి సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయన్న ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.


ఇక్రిశాట్ సహా ప్రపంచ స్థాయి ఉత్తమ వాతావరణ నమూనాల ప్రదర్శనపై ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ చర్చించారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ క్రెడిట్లలో పెట్టుబడులపై ప్రత్యేకంగా మాట్లాడారు. సుమారు 125 మంది గ్రామీణ ప్రతినిధులతో ఈ కాంక్లేవ్‌లో చర్చలు జరపనున్నట్లు వివరించారు. 2026, డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్ జరగనుంది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ

స్విమ్మింగ్ పూల్‌లో గిలగిల తన్నుకుంటున్న చిన్నారి.. ఇంతలో ఏం జరిగిందంటే.. వీడియో వైరల్

Updated Date - Nov 24 , 2026 | 08:10 PM