Share News

ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ

ABN , Publish Date - Nov 24 , 2026 | 07:34 PM

రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మలి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ
AP DGP Harish Kumar Gupta

అమరావతి, నవంబర్ 24: రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మలి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎన్నికల నిర్వహణ కోసం 46,080 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘా, అదనపు బలగాల మోహరిస్తామని చెప్పారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిళ్లకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు.


రాష్ట్రంలో మూడు విడతలుగా నవంబర్ 26, 29, డిసెంబర్ 02 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 123 స్థానిక సంస్థల్లో 100కు తొలి దశలోనే ఎన్నికలు నిర్వహించారు. అయితే 23 స్థానిక సంస్థలకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి. అవి ఇటీవల పరిష్కారమయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 26వ తేదీన సదరు స్థానిక సంస్థలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ముగిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మళ్లీ 'హే రామ్' అంటూ కొత్త నాటకం.. బుచ్చి రాంప్రసాద్ ఫైర్

స్విమ్మింగ్ పూల్‌లో గిలగిల తన్నుకుంటున్న చిన్నారి.. ఇంతలో ఏం జరిగిందంటే.. వీడియో వైరల్

Updated Date - Nov 24 , 2026 | 07:44 PM