డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:32 AM
డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసుశాఖ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య నేతృత్వంలో చేపట్టిన సమన్వయ చర్యలు, దర్యాప్తు, డ్రగ్స్ ముఠాల కట్టడి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది.
ఈగల్ ఫోర్స్‌కు పురస్కారం ప్రదానం
హైదరాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసుశాఖ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య నేతృత్వంలో చేపట్టిన సమన్వయ చర్యలు, దర్యాప్తు, డ్రగ్స్ ముఠాల కట్టడి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది.
న్యూఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్‌బ్యూరో ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన జాతీయ స్థాయి యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ అధిపతుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా సందీప్ శాండిల్య జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు అంశాల్లో ఈగల్ ఫోర్స్ 80శాతానికి పైగా మార్కులు సాధించింది. జాతీయ స్ధాయిలో పురస్కారం సాధించిన ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యను, సిబ్బందిని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్..!
ఐదు డీఏలు ఇవ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News