డీఎస్పీల పదోన్నతుల పంచాయితీకి తెర?
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:52 AM
తెలంగాణ పోలీసు శాఖలో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్పీల పదోన్నతుల సమస్య పరిష్కారంపై ఉత్కంఠ నెలకొంది.
450 మంది భవితవ్యంపై నేడు డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
హైదరాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసు శాఖలో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్పీల పదోన్నతుల సమస్య పరిష్కారంపై ఉత్కంఠ నెలకొంది. సుమారు 450 మంది అధికారులకు సంబంధించిన అంశంపై డీజీపీ సీవీ ఆనంద్ గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్, వరంగల్ రేంజ్‌లకు చెందిన 1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారులను సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియామకాలు కావడంతో వీరి పదోన్నతుల వ్యవహారం ఏపీ క్యాడర్ కంట్రోలింగ్ ఆథారిటీ పరిధిలోకి వెళ్లింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూపొందించిన సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో వివాదం మొదలైంది.
ఖాళీల కేటాయింపులో హైదరాబాద్ సిటీ, వరంగల్ రేంజ్‌కు అన్యాయం జరిగిందంటూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో పతోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సమస్యపై దృష్టి సారించారు. కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే న్యాయం చేస్తామని, అదనపు ఎస్పీల పదోన్నతులను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా సమీక్షలో సీనియారిటీ ఆధారంగా పదోన్నతులపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. జోన్ల వారీగా ఖాళీలను పరిగణనలోకి తీసుకుంటే మళ్లీ వివాదం తలెత్తుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News