Share News

కరువు సాయంగా రూ.50వేల కోట్లు ఇవ్వాలి

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:39 AM

ఎల్‌నినో నేపథ్యంలో తెలంగాణకు కరువు సాయం కింద కేంద్రం తక్షణమే రూ.50వేల కోట్లు ప్రకటించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు.

కరువు సాయంగా రూ.50వేల కోట్లు ఇవ్వాలి

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

ఖమ్మం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎల్‌నినో నేపథ్యంలో తెలంగాణకు కరువు సాయం కింద కేంద్రం తక్షణమే రూ.50వేల కోట్లు ప్రకటించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటనలకు పరిమితం కాకుండా రైతులకు, రైతు కూలీలకు కరువు సాయం ప్రకటించాలని కోరారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రైతులకు, కూలీలకు కరువుసాయం ప్రకటించాయని చెప్పారు.


ఆదివారం ఖమ్మం సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరికి మద్దతు ధర పెంచాలన్నారు. ‘సర్‌’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ఓట్లను తీసి దొడ్డిదారిన గెలవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో పీడీఎఫ్‌ అభ్యర్ధి కొల్లి సత్యనారాయణకు సీపీఎం మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం విషయంలో ఇతర వామపక్షాలతో చర్చించి నిర్ణయిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 05:39 AM