తాగునీటి కోసం రూ.120 కోట్లు: మంత్రి సీతక్క
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:47 AM
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడబోయే తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడబోయే తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లు, ఇతర జిల్లాల్లో తక్షణ అవసరాల కోసం రూ.కోటి చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు.
ఈ నిధులతో ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, ప్రజారోగ్యశాఖ అధికారులతో శనివారం ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి ఎద్దడి ఎక్కువ ఉండే ప్రాంతాల్లో స్థానిక వనరులకు ప్రత్యామ్నాయంగా బోరు బావులను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News