Share News

బాణాసంచా విక్రయానికి 7601 లైసెన్సుల జారీ:డీజీ విక్రమ్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:25 AM

దీపావళి పండగ సందర్భంగా బాణాసంచా విక్రయానికి రాష్ట్రంలో 7601 దుకాణాలకు లైసెన్సులు జారీ చేశామని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ తెలిపారు.

బాణాసంచా విక్రయానికి 7601 లైసెన్సుల జారీ:డీజీ విక్రమ్‌
Vikram Singh Mann

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండగ సందర్భంగా బాణాసంచా విక్రయానికి రాష్ట్రంలో 7601 దుకాణాలకు లైసెన్సులు జారీ చేశామని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ తెలిపారు. సురక్షితంగా దీపావళి నిర్వహణ ఏర్పాట్లపై ఆయన జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. పండగ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా విక్రయించినా, నిల్వ చేసినట్లు గుర్తించినా అటువంటి వారిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు, పెద్దల పర్యవేక్షణలో చిన్న పిల్లలు టపాసులు కాల్చాలని ఆయన సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 06:25 AM