నిర్ణీత గడువులోగా ఆదాయ లక్ష్యాలను సాధించాలి
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:05 AM
ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు.
మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో భట్టి
మైనారిటీల విద్యా సదుపాయాలకు సత్వరమే నిధులు
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన... ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... పారిశ్రామిక లే-అవుట్లు, పాత పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగం, క్రమబద్ధీకరణ వంటి మార్గాల ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో యూనిట్లవారీగా భూముల క్రమబద్ధీకరణ, అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు.
చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించాలని, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా మైనారిటీల సంక్షేమంపై మంత్రి అజారుద్దీన్‌తో కలిసి భట్టి ప్రజాభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మైనారిటీల విద్యా సదుపాయాలకు నిధుల విడుదలలో జాప్యం, ఆంక్షలు ఉండబోవని భరోసా ఇచ్చారు. నగరంలోని పాత బస్తీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. నాంపల్లిలోని హజ్ హౌజ్ పక్కన అసంపూర్తిగా నిలిచిపోయిన బహుళ అంతస్తుల భవన నిర్మాణ పూర్తికి అంచనాలను రూపొందించాలన్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి వక్ఫ్‌బోర్డుకు రావాల్సిన నిధుల్లో రూ.25 కోట్లను దీనికి కేటాయించాలని ఆదేశించారు. మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం పరిధిని విస్తరించనున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News