Share News

127 మంది సైబర్ నేరస్తులు అరెస్ట్: టీజీసీ‌ఎస్‌బీ

ABN , Publish Date - Jun 10 , 2026 | 09:02 PM

127 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీ‌ఎస్‌బీ) బుధవారం వెల్లడించింది. సైబర్ మోసాలపై ఆపరేషన్ క్రాక్ డౌన్ 3.0లో భాగంగా ఈ నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది.

127 మంది సైబర్ నేరస్తులు అరెస్ట్: టీజీసీ‌ఎస్‌బీ

హైదరాబాద్, జూన్10: 127 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీ‌ఎస్‌బీ) బుధవారం వెల్లడించింది. సైబర్ మోసాలపై ఆపరేషన్ క్రాక్ డౌన్ 3.0లో భాగంగా ఈ నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 127 మంది సైబర్ నేరస్తులను గుర్తించామని వివరించింది. వారిలో 57 మంది తెలంగాణకు చెందిన వారని.. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని పేర్కొంది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, జిల్లా సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ కేంద్రాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని వివరించింది. 48 మంది నకిలీ గుర్తింపుతో ఈ మోసాలకు పాల్పడ్డారని తెలిపింది.


27 మంది ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, 11 మంది డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లలో ఉన్నట్లుగా గుర్తించామని చెప్పింది. ఈ నిందితుల్లో 68 శాతం మంది పాత సైబర్ నేరస్తులేనని టీజీసీఎస్‌బీ స్పష్టం చేసింది. ప్రజలను మోసం చేసినట్లు 103 మంది నిందితులు తమ విచారణలో వెల్లడించారని తెలిపింది. ఈ నిందితుల వద్ద నుంచి కీలక డిజిటల్ ఆధారాలతోపాటు పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు టీజీసీఎస్‌బీ పేర్కొంది. అయితే 24 మంది నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించింది. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పింది. సైబర్ నేరాల కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్టీల్ ప్లాంట్ పదం పలకడానికి అర్హత లేని వ్యక్తి జగన్: మంత్రి అనిత

సీఎం రేవంత్‌కు ఓటమి తప్పదు: ఎంపీ అర్వింద్

For More TG News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 09:22 PM