చలికి గజగజ రాత్రివేళ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:00 AM
వాతావరణం చల్లబడింది. ఉక్కబోత మాయమైంది. చలి మొదలైంది.. పెరుగుతోంది! రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలులు వీస్తున్నాయి. అక్కడక్కడా పొగమంచు కురుస్తోంది.
పటాన్‌చెరులో 13 డిగ్రీలు
సీజన్‌లో తొలిసారి 15 డిగ్రీలలోపు
రానున్న రోజుల్లో పెరగనున్న చలి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
వాతావరణం చల్లబడింది. ఉక్కబోత మాయమైంది. చలి మొదలైంది.. పెరుగుతోంది! రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలులు వీస్తున్నాయి. అక్కడక్కడా పొగమంచు కురుస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న మార్పు ఇది. సోమవారం పటాన్‌చెరులో 13 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌లో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో రాత్రిపూట ఉష్ణోగ్రత 15 డిగ్రీల లోపు నమోదవ్వడం ఇదే తొలిసారి.
హైదరాబాద్‌లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీల మేర పడిపోయాయి. ఆకాశంలో మబ్బులు లేకపోవడంతో చలిగాలుల ప్రబావం ఎక్కువగా ఉంటోందని.. రానున్న రోజుల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అయితే పగటిపూట మాత్రం చాలా ఎండలు తగ్గలేదు. రాత్రిపూట తట్టుకోలేనంత చలి ఉన్నా పగలు బాగా ఎండ కోడుతోంది. రంగారెడ్డిజిల్లా బాలాపూర్, సరూర్‌నగర్ మేడ్చల్ జిల్లా కీసర, వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌లో 35 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
బీజేపీ ‘లోక్‌తంత్ర బచావో.. అరాచకత హఠావో’
ఫతేనగర్ గంజాయి కేసులో 65 మందికి పాజిటివ్
నా పంట పోతే.. నేనే బాధ్యుణ్ని!
Read Latest AP News And Telangana News And International News And Telugu News