కోడి ధర కిలోకు రూ. 110గా నిర్ణయించాలి!
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:24 AM
కోళ్ల ధరల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో లైవ్ చికెన్ (కోడి) ధర కిలోకు రూ. 110గా నిర్ణయించాలని, అన్ని ప్రాంతాల్లో ఒకే ధరల విధానాన్ని అమలుచేయాలని పౌల్ట్రీ బ్రీడర్స్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
దాణా ధర తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కోళ్ల ధరల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో లైవ్ చికెన్ (కోడి) ధర కిలోకు రూ. 110గా నిర్ణయించాలని, అన్ని ప్రాంతాల్లో ఒకే ధరల విధానాన్ని అమలుచేయాలని పౌల్ట్రీ బ్రీడర్స్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా పౌల్ర్టీ బ్రీడర్స్ అసోసియేషన్, పాన్ ఇండియా బ్రాయిలర్ కోఆర్డినేషన్ కమిటీ, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్‌తో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు పలు తీర్మానాలు చేశారు.
పండుగల సమయంలో వినియోగం తగ్గటంతో ఇటీవల చికెన్ ధరలు తగ్గాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుత ధరల పతనం తాత్కాలికమేనని రైతులు, వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకొని సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో సోయాబీన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వాటిని దిగుమతి చేసుకుంటే దాణా ధరలు తగ్గుతాయని, పౌల్ట్రీ పరిశ్రమకు ఊరట లభిస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News