అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: సీతక్క
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:34 PM
తెలంగాణలో అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబర్19: రాష్ట్రంలో అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులకు కొత్తగా చేయూత పథకం కింద 11,275 మందికి పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఫైల్‌పై గురువారం మంత్రి సీతక్క సంతకం చేశారు.
దీంతో 5,895 మంది ఫైలేరియా బాధితులకు, 3,024 మంది ఎయిడ్స్ బాధితులకు, 2,356 మంది డయాలసిస్ రోగులకు ఈ పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేయనుంది. నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పింఛన్ నగదు జమ చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో చేయూత పింఛన్లు తీసుకుంటున్న వారు 4,75,132కు చేరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..? వాహనదారులకు బిగ్ అలర్ట్
For More TG News And Telugu News