సీజీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:35 AM
తెలంగాణలో కన్వీనర్ కోటాలో పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వైద్యులు ఏడాది పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించాల్సి ఉంటుంది.
పీజీ వైద్యుల ఏడాది సేవకు పోస్టింగ్‌లు..
16నుంచి ఆప్షన్లు
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కన్వీనర్ కోటాలో పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వైద్యులు ఏడాది పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించాల్సి ఉంటుంది. ఈ మేరకు కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్(సీజీఎస్) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం(డీఎంఈ) శనివారం విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, డిసెంబరు 1 నుంచి 5వ తేదీలోగా కేటాయించిన ఆస్పత్రుల్లో చేరాలని ఆదేశించింది.
అభ్యర్థులు నవంబర్ 16 ఉదయం 11గంటల నుంచి 22వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు dme.telangana.gov.in లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పీజీ ఫైనల్ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తారు. కేటాయించిన ఆస్పత్రిలో చేరకపోయినా, ఏడాది సర్వీస్ పూర్తి చేయకపోయినా బాండ్ నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పీజీ డిగ్రీ చేసినవారికి రూ.20లక్షలు, డిప్లొమా చేసినవారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. పోస్టింగ్‌లు పొందినవారు డిసెంబర్ 1 నుంచి 5వ తేదీలోగా సంబంధిత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డైరెక్టర్ లేదా డీన్ వద్ద రిపోర్ట్ చేయాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News