Share News

తెలంగాణ కేబినెట్ ముందుకు 10 కీలక బిల్లులు

ABN , Publish Date - Mar 23 , 2026 | 08:32 PM

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కేబినెట్ ముందుకు 10 కీలక బిల్లులు
Telangana Cabinet Meeting

హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 10 కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సభలో ప్రవేశపెట్టాల్సిన మూడు ముఖ్య బిల్లులపై కేబినెట్ సభ్యులు సమగ్రంగా చర్చించారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.


రాష్ట్రంలో సుమారు 3 నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరేలా ఈ బిల్లును రూపొందించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లులో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కోర్ అర్బన్ యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లుపై కూడా కేబినెట్‌లో చర్చ కొనసాగినట్లు సమాచారం. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read:

ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి

ఈ పండ్లు, కూరగాయలను కలిపి నిల్వ చేయకండి.. ఎందుకంటే

For More Latest News

Updated Date - Mar 23 , 2026 | 09:03 PM