బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
ABN , Publish Date - Jul 27 , 2026 | 07:05 PM
రాష్ట్రంలో హైడ్రాను నిషేధిస్తే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రాంచందర్ రావు అన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఆయన స్పందించారు.
హైదరాబాద్, జులై 27: రాష్ట్రంలో హైడ్రాను నిషేధిస్తే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రాంచందర్ రావు అన్నారు. హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సోమవారం ఆయన స్పందించారు. ఈ తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాంటిదని అభివర్ణించారు. రంగనాథ్‌ను బలిపశువు చేశారని చెప్పారు. రేవంత్, ఎంఐఎం కనుసన్నల్లో హైడ్రా నడిచిందని విమర్శించారు. ఫాతిమా కాలేజీ, బడాబాబుల జోలికి హైడ్రా వెళ్లలేదని గుర్తు చేశారు. తొలి నుంచి పేదల ఇళ్లే హైడ్రా టార్గెట్ చేసిందని మండిపడ్డారు. హైడ్రాను రద్దు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్‌ను టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని అభిప్రాయపడింది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని తేల్చి చెప్పింది. ఆయన్ని తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలను ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు స్వాగతించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త చంద్రబాబే.. బొత్స వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: మంత్రి శ్రీనివాస్
For TG News And Telugu News