Share News

స్లాట్లు రద్దు చేసుకుంటే రిఫండ్‌ గగనమే..

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:42 AM

రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ ద్వారా స్లాట్‌ రద్దు చేసుకున్న దరఖాస్తుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

స్లాట్లు రద్దు చేసుకుంటే రిఫండ్‌ గగనమే..
Bhu Bharati Portal

  • భూభారతిలో అగమ్యగోచరంగా దరఖాస్తుదారుల పరిస్థితి

  • మొత్తం దరఖాస్తులు 31,314..

  • రిఫండ్‌ చేసినవి 4,574

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ ద్వారా స్లాట్‌ రద్దు చేసుకున్న దరఖాస్తుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూముల లావాదేవీల కోసం స్లాట్లు బుక్‌ చేసుకుని.. వివిధ కారణాలతో రద్దు చేసుకున్న దరఖాస్తుదారుల ఖాతాల్లో వెంటనే నగదు జమ కావాల్సి ఉంది. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తరహా దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసుకున్న స్లాట్లు 31,314 ఉండగా అందులో రిఫండ్‌ చేసిన దరఖాస్తులు 4,574 మాత్రమే. సుమారు రూ.100.57 కోట్లు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.12.97 కోట్లు మాత్రమే చెల్లించింది.


రిఫండ్‌ చేయాల్సిన మొత్తంలో 87.1 శాతం..దరఖాస్తుల్లో 85.4శాతం పెండింగ్‌లో ఉన్నా యి. దరఖాస్తుదారుల్లో ధరణి నుంచి రిఫండ్‌ కోసం ఎదురు చూస్తున్న రైతులు కూడా ఉన్నారు. అధికారుల తీరుతో విసిగిపోతున్న రైతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో జిల్లాలో 3,958 మంది స్లాట్‌ రద్దు చేసుకోగా వారిలో ముగ్గురికి మాత్రమే రిఫండ్‌ జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్‌ జిల్లాల్లో 10,740 దరఖాస్తులు పెండింగ్‌లోఉన్నాయి. మెదక్‌ జిల్లాలో 1,200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే ఒక్కదానికి కూడా రిఫండ్‌ రాలేదు. మహబూబ్‌నగర్‌లో 1,262, నాగర్‌కర్నూల్‌లో 1,186దరఖాస్తులుపెండింగ్‌లో ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:42 AM