Share News

బార్ల మీద స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఫీజుపై మధ్యంతర స్టే

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:22 AM

రాష్ట్రంలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల నుంచి స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఫీ వసూలు చేసే ఉద్దేశంతో అక్టోబర్‌ 19న ఎక్సైజ్‌శాఖ జారీచేసిన జీవో 205పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది.

బార్ల మీద స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఫీజుపై మధ్యంతర స్టే
Telangana High Court

  • జీవో 205 అమలు 4 వారాలపాటు నిలిపివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల నుంచి స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఫీ వసూలు చేసే ఉద్దేశంతో అక్టోబర్‌ 19న ఎక్సైజ్‌శాఖ జారీచేసిన జీవో 205పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఆ జీవో అమలును నాలుగువారాలపాటు నిలిపేస్తున్నట్లు పేర్కొంది. స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఫీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలు బార్ల యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.


వీటిపై జస్టిస్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఫీ జీవో అమలును నాలుగు వారాలపాటు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖకు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 05:22 AM