రాష్ట్రంలో కొత్తగా 240 పీఏసీఎస్‌లు
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:57 AM
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న 908 పీఏసీఎస్‌లను పునర్విభజించడంతో పాటు, కొత్తగా మరో 240 సంఘాల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ వ్యవసాయ, సహకార శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి కె. సురేంద్రమోహన్ తెలిపారు.
సహకార చట్టం-1964లోని సెక్షన్ 15-ఏ, సెక్షన్ 43, ఇతర సంబంధిత నిబంధనలు, ఆ చట్టం నిబంధనల్లోని రూల్ 11-ఏ ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. పునర్విభజన, కొత్త సంఘాల వివరాలను మెమోకు జతచేసిన అనుబంధంలో పొందుపరిచారు. తుది ఉత్తర్వులు జారీ చేసే ముందు చట్టం, నిబంధనల ప్రకారం నిర్దేశించిన అన్ని శాసనబద్ధ ప్రక్రియలను పూర్తి చేయాలని రిజిస్ట్రార్‌కు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ప్రస్తుత ఉత్తర్వులు కేవలం ‘తదుపరి చర్యలకు అనుమతి’ మాత్రమే. సంఘాల తుది ఏర్పాటు ఉత్తర్వులు ఆ తర్వాతే వెలువడతాయి. ఇదివరకే ఉన్న 908 పీఏసీఎస్‌లు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 240 కలిపితే మొత్తం పీఏసీఎస్‌ల సంఖ్య 1,148 చేరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News