Share News

పెట్టుబడుల ఆకర్షణకు ఏఐ అస్త్రం!

ABN , Publish Date - Jul 31 , 2026 | 09:05 AM

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు కృత్రిమ మేధ(ఏఐ)ని వినియోగానికి సిద్ధమవుతోంది.

పెట్టుబడుల ఆకర్షణకు ఏఐ అస్త్రం!

  • రెండు నెలల్లో ఏఐ ఆధారిత టీజీ-ఐపాస్‌

  • ప్రస్తుతం 69 సేవలు, మరో 93 అనుమతుల జోడింపు

  • దరఖాస్తుల పరిశీలన, అనుమతుల జారీ మరింత వేగవంతం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు కృత్రిమ మేధ(ఏఐ)ని వినియోగానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత టీజీ-ఐపా్‌సను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి టీజీ-ఐపాస్‌లో ప్రస్తుతం 69 రకాల అనుమతులు పొందవచ్చు. అయితే, కొత్తగా తీసుకురానున్న ఏఐ ఆధారిత టీజీఐపాస్‌లో ఈ 69కి అదనంగా మరో 93 రకాల అనుమతులు, లైసెన్సులు, దరఖాస్తు ప్రక్రియలను చేర్చనున్నారు. కొత్తగా చేర్చే వాటిల్లో సొసైటీలు, వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్‌, తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్‌, చెట్లు, అటవీ సంబంధిత అనుమతులు, పారిశ్రామిక ప్రాంతాల్లో భూమి కేటాయింపు, మ్యుటేషన్‌, ఆస్తి పన్ను తదితర కీలక సేవలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ అనుమతలు, సేవల కోసం పెట్టుబడిదారులు మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, అటవీ, వ్యవసాయ తదితర శాఖలకు విడివిడిగా దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. ఏఐ ఆధారిత కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సేవలన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. అంతేకాక, ఐజీ-ఐపాస్‌లోని ఏఐ.. దరఖాస్తుల్లోని లోపాలను ముందుగానే గుర్తించి సూచనలు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. పత్రాల పరిశీలన, సంబంధిత శాఖలకు వాటి పంపిణీ ఆటోమెటిక్‌గా జరగనున్నాయి. దీంతో అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. పెట్టుబడిదారుల సమయం, వ్యయం కూడా తగ్గుతాయి. ఏఐ ఆధారిత టీజీ-ఐపా్‌సను రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీజీ-ఐపా్‌సలో చేస్తున్న మార్పులు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

తలసేమియా బాధితులకు పింఛన్లు

Updated Date - Jul 31 , 2026 | 09:05 AM