వీసీ పదవి నుంచి జానయ్యను తొలగించాలి
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:55 AM
విచారణ కమిటీ నివేదిక వచ్చే వరకు వ్యవసాయ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యను బాధ్యతల నుంచి తొలగించాలని బాధిత అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ డిమాండ్ చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ నిరవధిక దీక్ష
రాజేంద్రనగర్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): విచారణ కమిటీ నివేదిక వచ్చే వరకు వ్యవసాయ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యను బాధ్యతల నుంచి తొలగించాలని బాధిత అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా తేజశ్రీ మాట్లాడుతూ జానయ్య వీసీ పదవిలో కొనసాగుతున్నందున తనకు మద్దతు తెలిపే వారిపై కేసులు నమోదు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా, దీక్ష చేపట్టిన తేజశ్రీని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సాయంత్రం విడుదల చేయగా, తిరిగి వర్సిటీలోనే దీక్ష కొనసాంగించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్
వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు
ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News