Share News

వలస ఆదివాసీలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలివ్వాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:48 AM

ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం, భద్రతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు.

వలస ఆదివాసీలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలివ్వాలి

  • గూడాలలో మౌలిక వసతులు కల్పించాలి: జాన్‌ వెస్లీ

  • ఇందిరాపార్కు వద్ద సీపీఎం మహాగర్జన

హైదరాబాద్‌, కవాడిగూడ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం, భద్రతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. వలస ఆదివాసీలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద వలస ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు వారు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీల మహాగర్జన నిర్వహించారు.


ఈ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు పిల్లలతో వేలసంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, మాజీ ఎంపీ మిడియం బాబురావు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ఛత్తీ్‌సగఢ్‌ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య నలిగిపోయి దశాబ్దాల క్రితం తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకున్న ఆదివాసీలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 06:48 AM