క్వారీలు నడవాలా.. డబ్బులివ్వండి!
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:16 AM
గ్రానైట్ క్వారీ కంపెనీలను పని చేయకుండా అడ్డుకుంటున్నారని.. డబ్బులివ్వాలంటూ ఫిర్యాదులు, కేసు నుంచి తప్పిస్తానంటూ బేరసారాలకు దిగడం ఇలా వేర్వేరు ఘటనలకు సంబంధించి..
మహబూబాబాద్ జిల్లాలో ఓ సర్పంచ్ డిమాండ్
వలపన్ని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు
హైదరాబాద్, ఖమ్మం క్రైమ్, కురవి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రానైట్ క్వారీ కంపెనీలను పని చేయకుండా అడ్డుకుంటున్నారని.. డబ్బులివ్వాలంటూ ఫిర్యాదులు, కేసు నుంచి తప్పిస్తానంటూ బేరసారాలకు దిగడం ఇలా వేర్వేరు ఘటనలకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మోదుగడ్డ తాండా సర్పంచ్ ధరావత్ వీరూ, పెద్దపల్లి సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి. రవీందర్‌ను, రాజయ్య అనే మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శారదా స్టోన్‌ఎక్స్, ప్రీమియర్ గ్రానైట్స్, రాశి గ్రానైట్స్ సంస్ధలు తమకు కప్పం చెల్లించనిదే పని చేయడానికి వీలు లేదంటూ వీరూ బెదిరింపులకు దిగారని, తనకు రూ.30లక్షలివ్వాలని డిమాండ్ చేశారు.
బేరసారాల తర్వాత గ్రానైట్ కంపెనీలు రూ.13 లక్షలు ఇవ్వడానికి అంగీకరించాయి. తొలి వాయిదా కింద రూ.2 లక్షలు బుధవారం ధరావత్ వీరూ తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న డి.రవీందర్.. ధర్మారం పోలీసుస్టేషన్‌లో 2023లో నమోదైన ఒక కేసు విచారణలో నిందితులకు సహకరిస్తానని బేరం మాట్లాడుకొని తన తరఫున ప్రైవేటు వ్యక్తి రాజయ్యను రంగంలో దింపారు. కేసు ట్రయల్ జరుగుతుండగా సాక్షుల విచారణలో సహకరించి కేసు కొట్టేసేలా చూస్తానని, తనకు రూ.2లక్షలు ఇవ్వాలని రవీందర్ డిమాండ్ చేశారు. చివరికి రూ.1.5లక్షలు ఇవ్వడానికి బాధితులు అంగీకరించారు. రవీందర్ ఇంటి బయట బాధితుల నుంచి రాజయ్య డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News