19న పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల ప్రారంభం
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:11 AM
ప్రభుత్వం నిర్మించిన పంచాయతీ, ఎస్‌హెచ్‌జీ, అంగన్‌వాడీ భవనాలను ఈనెల 19న ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం నిర్మించిన పంచాయతీ, ఎస్‌హెచ్‌జీ, అంగన్‌వాడీ భవనాలను ఈనెల 19న ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థిశాఖ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలను చేపట్టారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 2,216 నూతన భవనాలను ప్రారంభించనున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ భవనాల్లో 599 గ్రామ పంచాయతీ భవనాలు, 1,399 గ్రామ మహిళా సంఘం భవనాలు, 184 అంగన్వాడీ భవనాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు
ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్ సమ్మిట్ 2.0
Read Latest Telangana News And AP News And National News
And Telugu News