Share News

సింథటిక్‌ మాంజా విక్రయిస్తే షాపు లైసెన్సు రద్దు

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:45 AM

సింథటిక్‌ మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

సింథటిక్‌ మాంజా విక్రయిస్తే షాపు లైసెన్సు రద్దు
synthetic manja ban Telangana

  • అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్‌

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): సింథటిక్‌ మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సింథటిక్‌ మాంజా విక్రయించే దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు.


సింథటిక్‌ మాంజా ఇతర రాష్ర్టాల నుంచి సరఫరా అవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా రాజస్థాన్‌, గుజరాత్‌ నుంచి వచ్చే సరఫరాలపై నిఘా పెంచాలన్నారు. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో సింథటిక్‌ మాంజా విక్రయాలను గుర్తించి, చర్యలు తీసుకోవాలన్నారు. దుర్గా మండపాల వద్ద పాలపిట్టలను పంజరాల్లో ఉంచి ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బోధనాస్పత్రుల్లో వెల్‌నెస్‌ కేంద్రాలు
సీఎంఆర్‌ ధాన్యం దారిమళ్లింపు.. మిల్లు భాగస్వాములపై కేసు!\

‘గిరిజన’ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 06:45 AM