జాతీయవాదాన్ని అణచివేసే కుట్రలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:20 AM
దేశంలో అల్లర్లు సృష్టిస్తూ జాతీయవాదాన్ని అణచివేసేందుకు విదేశీ, అంతర్గత శక్తులు కుట్రలు పన్నుతున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ఆరోపించారు.
విదేశీ, అంతర్గత శక్తులు కలిసి పన్నుతున్నాయి: సునీల్ బన్సల్
మన్సూరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశంలో అల్లర్లు సృష్టిస్తూ జాతీయవాదాన్ని అణచివేసేందుకు విదేశీ, అంతర్గత శక్తులు కుట్రలు పన్నుతున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ఆరోపించారు. దీనిని ఎదుర్కొనేందుకు అంతా ఏకమై మరోసారి సిద్ధాంతపరమైన సమరానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాగోల్‌లో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ‘జాతీయవాదుల సంగమం-2026’ పేరిట భారీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. జాతీయవాద భావజాలంతో విద్యార్థి పరిషత్‌లో చేరిన కార్యకర్తలు నేడు వివిధ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఏబీవీపీలో నేర్చుకున్న విలువలు, అనుభవాలు జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. పాత కార్యకర్తలంతా మళ్లీ కలుసుకుంటూ పరస్పర పరిచయాలు, సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ సహ ఇన్‌చార్జిగా నియమితుడైన కాసం వెంకటేశ్వర్లును సునీల్ బన్సల్ సన్మానించారు. ఓయూ, కేయూ జేఏసీ చైర్మన్ పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు. ఏబీఆర్‌ఎ్‌సఎం (ఆర్‌ఎ్‌సఎస్) జాతీయ సంఘటన్ మంత్రి గుంతా లక్ష్మణ్, ఏబీవీపీ జాతీయ సంఘటన్ మంత్రి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News