Share News

తెలంగాణ విప్లవ సాహిత్యంలో సుద్దాల హనుమంతు చిరస్మరణీయులు

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:18 AM

తెలంగాణ విప్లవ సాహిత్య పరంపరలో సుద్దాల హనుమంతు పాత్ర చిరస్మరణీయమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ విప్లవ సాహిత్యంలో సుద్దాల హనుమంతు చిరస్మరణీయులు
Suddala Janakamma Hanumanthu Awards

  • ఎంతోమందికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: అద్దంకి

  • ఘనంగా ‘సుద్దాల జానకమ్మ, హనుమంతు’ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం

హైదరాబాద్‌ సిటీ, రవీంద్రభారతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విప్లవ సాహిత్య పరంపరలో సుద్దాల హనుమంతు పాత్ర చిరస్మరణీయమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ పేర్కొన్నారు. తనలాంటి వారికి ఎంతో మందికి ఆయన జీవితం స్ఫూర్పినిచ్చిందన్నారు. తెలంగాణ డీఎన్‌ఏలోనే జానపదం, పోరాటం ఉందని.. అన్యాయం జరుగుతుంటే కవి నుంచి సామాన్యుడి వరకూ అన్ని వర్గాల ప్రజలూ ప్రశ్నిస్తారని, తిరగబడతారని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సుద్దాల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘సుద్దాల జానకమ్మ, హనుమంతు’ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీంట్లో భాగంగా జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవయిత్రి స్వాతి శ్రీపాదకు, జాతీయ జానపద పురస్కారాన్ని యక్షగాన కళాకారుడు మహ్మద్‌ అక్బర్‌పాషాకు ప్రదానం చేశారు.


ముఖ్య అతిథిగా హాజరైన అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ జానపద అకాడమీని నెలకొల్పి దానికి సుద్దాల హనుమంతు పేరు పెట్టాలన్న ప్రతిపాదనను, సుద్దాల స్మారక అవార్డు ప్రదానోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలన్న విజ్ఞప్తిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తెలుగు వర్సిటీ వీసీ వెలుదండి నిత్యానందరావు మాట్లాడుతూ.. సమాజ చైతన్యానికి సాహిత్యం, జానపద కళలు శక్తివంతమైన ఆయుధాలని, సుద్దాల కుటుంబం తరతరాలుగా కళలకు సేవ చేస్తోందని కొనియాడారు.


ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏటా కళాకారులను, రచయితలను గౌరవించుకోవడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అనువాద సృజనలో స్వాతి శ్రీపాద కృషిని వక్తలు కొనియాడారు. కళాకారులకు కుల, మతాల అడ్డంకులు లేవన్న సందేశాన్ని మహమ్మద్‌ అక్బర్‌ పాషా ఎలుగెత్తి చాటుతున్నారని, ఈ దేశ బహుళత్వానికి ప్రతీకగా రాముడు, కృషుడు పాత్రలను కూడా ఆయన రంగస్థలం మీద అభినయిస్తున్నారని ప్రశంసించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

వరిసాగుతో కరీంనగర్‌ కళకళ

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 06:18 AM